728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, September 24, 2020

నరసరావుపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన నవతరం పార్టీ






 చెంచుకులస్తులకు భూములు కేటాయించాలని నరసరావుపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం,అఖిలపక్షం నేతలు. ✊చిలకలూరిపేట చెంచులకు భూములను స్వాధీనం చేయాలని చిలకలూరిపేట వైస్సార్సీపీ నేతలు అడ్డుకుంటే ఎమ్మెల్యే విడదల రజనీ సమర్థిస్తారా అని అఖిలపక్షం నేతలు ప్రశ్నించారు. నవతరం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 24.09.2020 ఉదయం11 గంటల కు చెంచులతో కలసి నిరసన తెలిపారు.సబ్ కలెక్టర్ శ్రీ వాసున్ పూర్ అజయ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.చెంచుకులస్తులకు 18 ఎకరాలు భూమి కోసం చిలకలూరిపేట మండలం లో నిధులు విడుదలకు కృషి చేయాలని కోరారు.2కోట్ల 20 లక్షలు మొత్తానికి గాను 1 కోటి 64 లక్షల రూపాయల సబ్సిడీ విడుదల అయినప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు అని తెలిపారు.సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బి శ్రీను నాయక్,కుంభ నాగేశ్వరరావు, దేవరకొండ నాగేశ్వరరావు, కుంభ రవీంద్ర,తెలుగుదేశం పార్టీ నేతలు కనపర్తి ,శ్రీనివాసరావు,షేక్ అజహార్, గూడూరు శేఖర్,కసుకుర్తి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నేత మర్రి భాస్కర్,చేరెడ్డి శ్రీరామిరెడ్డి,మాల మహానాడు అధ్యక్షుడు గోదా జాన్ పాల్ నేతలు వి జయరావు, పి కోటేశ్వరరావు,సీపీఎం నేతలు కామినేని రామారావు, శేఖర్, ముస్లిం లీగ్ నేతలు షేక్ మౌలాలి,షేక్ కరిముల్లా, బిసి సంక్షేమ సంఘం జిల్లా నేత బాదుగున్నల శ్రీనివాసరావు,హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఇండియా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మునాఫ్, నేషనల్ నవ క్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు, రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్,ఏ.ఐ. ఎం.ఐ. ఎం నేతలు షేక్ కరిముల్లా, షేక్ మౌలాలి, షేక్ ఆరీఫ్,ఎస్సి ఎస్టీ బిసి ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక అధ్యక్షుడు పఠాన్ మహమ్మద్ ఖాన్ లు పాల్గొని మద్దతు ప్రకటించి ప్రసంగించారు.చెంచుల నేత ఆవల వెంకటేశ్వర్లు బాధితులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నరసరావుపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన నవతరం పార్టీ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews