గుర్తు తెలియని 50-55 సంవత్సరాల వ్యక్తిని హతమార్చిన ముద్దాయి కి 302 సెక్షన్ కు గాను యావజ్జీవ కారాగార శిక్ష మరియు పదివేల రూపాయల జరిమానా, 394 సెక్షన్ కు గాను 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 5,000/- జరిమానా విదించిన న్యాయస్థానం
*నిందితునికి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్న పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు*
*సత్ఫలితాలిస్తున్న “ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ" .... పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు IPS గారు.*
*నరసరావు పేట 1వ పట్టణ PS*
Cr.No.88/2023 U/Sec 302,394 IPC
*SC.No : 649/2023*
*ఫిర్యాదుదారు*
చల్లా చిరంజీవి తండ్రి హనుమయ్య,
34 సం,
కులం: వడ్డెర, ఎలమంద గ్రామం, నరసరావుపేట మండలం.
I/C VRO of 15th Ward,Narasarao pet
*ముద్దాయి :-*
తన్నీరు అంకమ్మరావు తండ్రి వెంకయ్య, 30సం, కులం: వడ్డెర సాంబశివయ్య కాలనీ, నరసరావుపేట
*మృతుడు*
గుర్తుతెలియని 50 - 55 సంవత్సరములు గల మగ వ్యక్తి.
*శిక్ష:*
ముద్దాయి కు 302 సెక్షన్ కు గాను
యావజ్జీవ కారాగార శిక్ష మరియు 10,000/- జరిమాన,
394 సెక్షన్ కు గాను 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయలుm
*వివరణ:-*
నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు అయిన చల్లా చిరంజీవి (I/C VRO) గారికి నరసరావుపేట పట్టణంలోని కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ లో గల వెనుక భాగమున ఉన్న షాప్ నెంబరు GF20 లో వద్ద పక్కనే ఉన్న నాపరాళ్ళ ఫ్లోరింగ్ పై సుమారు 50-55 సంవత్సరముల గుర్తు తెలియని, ఊరు పేరు తెలియని ఒక మగ వ్యక్తి తల వెనుక బలమైన రక్త గాయం అయి వెల్లికలగా పడిపోయి ఆ రక్తపు మడుగులో ఉన్నాడని పోలీసుల ద్వారా తెలుసుకొని ఫిర్యాదు స్టేషన్ కు వచ్చి ఇచ్చిన రిపోర్టు కు గాను FIR చేయడం జరిగింది.
సదరు కేసుకు సంబందించి అప్పటి నరసరావుపేట 1వ పట్టణ ఇన్స్పెక్టర్
A. అశోక్ కుమార్ గారు కేసు నమోదు చేసి, విచారణ పూర్తి చేసి కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడమైనది.
సదరు కేసుపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు IPS గారి ఆదేశాలమేరకు ట్రైల్ మానిటరింగ్ ద్వారా నరసరావు పేట DSP K.నాగేశ్వర రావు గారి పర్యవేక్షణలో నరసరావుపేట 1వ పట్టణ ఇన్స్పెక్టర్ MV. చరణ్ గారి ఆద్వర్యంలో నరసరావుపేట 1వ పట్టణ పోలీసు వారు సరైన సాక్షాధారాలతో నిరూపించగా, సదరు కేసుకు సంబందించి గౌరవ 13th ADJ(అడిషనల్ జడ్జి) కోర్టు
నరసరావు పేట జడ్జి శ్రీ N.సత్యశ్రీ గారు ముద్దాయి కు 302 సెక్షన్ కు గాను
యావజ్జీవ కారాగార శిక్ష మరియు 10,000/- జరిమాన,
*394 సెక్షన్ కు గాను 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయలు* జరిమానా విదిస్తూ ఉత్తరులు జారీచేశారు.
0 comments:
Post a Comment