విశ్రాంతమైన డ్రైవర్ల, కండక్టర్ ల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలి.
డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు కు వినతి. షేక్ సుభాని,బి శ్రీను నాయక్.
చిలకలూరిపేట: పట్టణ ఆర్టీసీ డిపో నుంచి గుంటూరు వైపు వెళ్ళే ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు పెంచాలని ఏఐవైఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుభాని కోరారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబుకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భక్తుల సౌకర్యార్థం ఉదయం,సాయంత్రం బస్ సర్వీస్ నడపాలని, నాదెండ్ల, తూబాడు, గ్రామాలకు బస్ సర్వీస్ నడపాలని ఆయన కోరారు.
విశ్రాంతమైన డ్రైవర్ల కండక్టర్ల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని కోరారు. డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలన్నిటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బి.శ్రీను నాయక్, నియోజకవర్గ నాయకులు రాంబాబు నాయక్,తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment