విలువలతో కూడిన పారిశ్రామిక దిగ్గజం, నిరాడంబరుడు, సేవా తత్పరుడు పద్మ విభూషణ్ శ్రీ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు అని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు.
తన సంపాదనలో 63% పైగా చారిటీలకు ఖర్చు చేశారని, పారిశ్రామికవేత్తగా సంపాదనే లక్ష్యంగా ఆలోచించుకొని ఉంటే ప్రపంచ కుబేరులలో మూడో స్థానంలో ఉండే వారని అన్నారు. పారిశ్రామిక రంగంలో ఉన్నప్పటికిని, మానవీయ కోణంలో ఆలోచించి పేదవారికి తక్కువ ఖర్చులో కారు ఇవ్వాలనే సంకల్పంతో "నానో" కార్లను పరిచయం చేశారని అన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికిని ఆర్భాటాలకు పోకుండా తన జీవితాన్ని నిరాడంబరంగా గడిపారని అన్నారు. తన సంపాదనలో అధిక మొత్తం చారిటీలకు ఇవ్వడంలోనే తన ఆనందాన్ని వెతుక్కున్నారని అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం దిగ్భ్రాంతికరం అని అన్నారు. లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందించారని అన్నారు. *ఎంత ధనం సంపాదించాం అనే కంటే, ఎంతమందితో మనం మనసారా స్నేహభావంతో మెలుగుతున్నామనేదే ముఖ్యమని తను ఆచరించి చూపారు.* వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.
0 comments:
Post a Comment