రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం రాధాకృష్ణ డిమాండ్.
బ్యాంకు నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసిన యాజమాన్యమే వారు చేసిన తప్పిదాలకు, అక్రమాలకు కూడా బాధ్యత వహించాలని, డిపాజిటర్లకు సత్వర న్యాయం చేయాలని, నమ్మకం తో వారు దాచుకున్న డబ్బు బంగారం తిరిగి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం రాధాకృష్ణ డిమాండ్ చేశారు. చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ బ్రాంచ్ లు మూడింటిలో జరిగిన అక్రమాల్లో మేనేజర్ గా ఒకే వ్యక్తి ఉన్నాడని, అంటే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టి ఉంటుందని అన్నారు. ఒక్కొక్క బ్రాంచ్ లో ఉద్యోగులు రెండు నుంచి మూడు సంవత్సరాలు పనిచేస్తారని అంటే సుమారు 5 సంవత్సరాల నుండి అక్రమాలు జరుగుతుంటే యాజమాన్యం నిద్ర పోతుందా లేక నిద్ర పోతున్నట్టు నటించిందా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు ఆందోళన చెందుతుంటే బ్యాంకు యాజమాన్యం, ఉన్నతాధికారులు సంబంధింత బ్రాంచి లకు వచ్చి డిపాజిటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని బ్యాంకు యాజమాన్యాన్ని రాధాకృష్ణ సూటిగా ప్రశ్నించారు. సిఐడి విభాగం నిష్పాక్షిక, లోతైన విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షిస్తుందని, కానీ డిపాజిటర్లకు న్యాయం చేయవలసిన బాధ్యత బ్యాంకు యాజమాన్యం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్ గా ఉన్న సమయంలో అక్రమాలు ప్రారంభమై సంవత్సరాలు గడిచిందని ఈ సమయంలో బ్యాంకు నిబంధనల మేరకు ఎన్నో సార్లు ఆడిట్ జరిగి ఉంటుందని ,ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఆడిట్ అధికారులు గుర్తించక పోవడం ఏమిటని ప్రశ్నించారు?. సాంకేతిక పరమైన డిపాజిటర్ల ప్రశ్నలకు ఆడిటర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు . ఏదిఏమైనా జరిగిన నష్టానికి బాధ్యత వహించి డిపాజిటర్లకు సత్వర న్యాయం చేయాలని వారు దాచుకున్న డబ్బు, బంగారం వడ్డీతో సహా చెల్లించాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును రక్షణ కోసం బ్యాంకు లో దాచుకుంటే దోచుకున్న తీరు చూస్తుంటే కంచే చేనును చేసినట్లు ఉందని అన్నారు. అతి పెద్ద బ్యాంకు విశ్వసనీయతను దెబ్బతీసి అప్రతిష్ట పాలు జేసిన ఈ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు సిఐడి అధికారులు లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరిపి బ్యాంకు ఉద్యోగులేనా లేక వెనుక అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అని తేల్చాలని దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment