కుల మత సాంప్రదాయాలను గౌరవించాలి: మాజీ స్టేట్ వేజిలెన్స్ చేవూరి కృష్ణమూర్తి
చిలకలూరిపేట పట్టణంలోని 8 వ వార్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాజీ స్టేట్ వేజిలెన్స్ చేవూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి పెద్దపీట వేసే భారతదేశంలో మతాల మధ్య, వారి ఆచార వ్యవహారాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేడు ప్రాచీన సాంప్రదాయాల అవసరం లేదంటూ గౌరవ హోదాలలో ఉన్న వైకాపా పార్టీ నాయకులు అనిచిత వాఖ్యలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒకరి సాంప్రదాయాలను మరొకరు పరస్పరం గౌరవిస్తూ నేటివరకు శాంతి భద్రతల మధ్య ప్రజలందరూ జీవనం కొనసాగిస్తూoటే, నేడు రాజకీయ లబ్ధికోసం కులాల, మతాల పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్ని మతస్తుల మనోభావాలకు, వారి నమ్మకాలకు ఆచార వ్యవహారాలకు తగిన గౌరవం కల్పిస్తూ వారికి పెద్దపీట వేయాల్సిoదిపోయి,రోజురోజుకి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నప్పటికీ నిలువరించకుండా నేడు సనాతన సాంప్రదాయాలను అవహేళన చేసి మాట్లాడడం వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. సర్వమత సమ్మేళనమైన భారతదేశంలో కులాల, మతాల మధ్య చిచ్చు రేపే విధంగా నిర్ణయాలను వైకాపా ప్రభుత్వం మానుకొని, దశాబ్దాలుగా ఆచరిస్తున్న వారి వారి సనాతన సాంప్రదాయాలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాచుమల్లు సూర్యరావు, నాగ మల్లేశ్వరరావు, శేషు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment