రాజధానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లా...? అఖిలపక్ష నాయకులు. చిలకలూరిపేట : రాజధానికి భూములిచ్చిన ఎస్సీ, బిసి వర్గాల రైతులను అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా, వారికి బేడీలు (సంకెళ్ళు) వేసి రాజధాని ఉద్యమాన్నిఅణగతొక్కాలని చూస్తున్న వైసిపి ప్రభుత్వ నియంతృత్వానికి నిరసనగా చిలకలూరిపేట జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ఉప తహశీల్దార్ రవికుమార్ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ రైతులను అరెస్టు చేసి,రౌడిల్లా, దొంగల్లా బేడీలు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి రాజధాని జేఏసీ ఇచ్చిన మూడు రోజుల ఆందోళనలు, నిరసనలకు సంఘీభావం తెలియజేస్తునమన్నారు. జగన్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ రైతు, ప్రజాసంఘాలు నిర్వహించే ఆందోళనళకు జేఏసీ పూర్తి మద్దతునిస్తోందన్నారు. ఇదే సమయంలో వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోకపోవడం, ఇన్ పుట్ సబ్సిడీ అందించకపోవడం, కేసుల మాఫీ కోసం రాష్ట్ర రైతాంగ ఆశాదీపం అయిన పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టడం, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం వంటి నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజధాని గ్రామం కృష్ణాయపాలెం దళిత మరియు బి.సి. రైతులపై అక్రమముగా కేసులను నమోదు చేసి దళిత, బి.సి సోదరులకు ఇనుప సంకెళ్ళు వేసి అత్యంత ఆమానవీయంగా వ్యవహరించి అవమానించినందుకు నిరసన తెలుపడం జరుగుతుంది. తక్షణమే రైతులకు బేడీలు వేసిన సదరు పోలీస్ అధికారుల ఫై చర్యలు తీసుకోవలసిందిగా డిమాండ్ చేస్తున్నమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 317 రోజుల నుండి దీక్షలు చేస్తున్న రాజధాని రైతుల డిమాండ్లను తక్షణమే అంగీకరించి అమరావతినే శాశ్వత రాజధానిగా గుర్తించాలని, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మీ ద్వారా మా డిమాండ్లను ప్రభుత్వానికి పంపగలరు అని విన్నవించు కుంటున్నామన్నారు.
డిమాండ్స్ :
రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన రైతులపై, మహిళలపై, రైతు కూలీలపై అక్రమంగా పెట్టిన కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు2. దళిత, బీసీ రైతులకు సంకెళ్లు వేసి అమానవీయంగా వ్యవహరించిన డీఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు.3 తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతి యుతంగా పోరాడుతున్న రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలపై అణచివేత చర్యలకు, రెచ్చగొట్టే కార్యక్రమాలకు, రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఎం.రాధాకృష్ణ, టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు,షేక్ కరిముల్లా, సిపిఐ నాయకులు సి.ఆర్ మోహన్,బియస్పీ పార్టీ నల్లపు కోటి, లోక్ సత్తా మాదాసు భాను ప్రకాష్, నవతరం రావు సుబ్రమణ్యం, జనక్రాంతి షేక్ గౌస్, సిపిఐ షేక్ సుభాని, టిడిపి నాయకులు పఠాన్ సమద్ ఖాన్, ఇనగంటి జగదీష్, జమాల్ బాష, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, యస్ .ఏ.యన్ రాజు, అబ్దుల్ ఖుమీర్, షేక్ అబ్దుల్, షేక్ జాకీర్ లాజర్, ఫ్రాన్స్ స్, తేలబ్రోలు రామ్మూర్తి,లోక బ్రహ్మయ్య, పూర్ణ సింగ్, బోల్లయ్య, ఉదయ్ సింగ్, బెజ్జం రవి, పిల్లి కోటి, బొంతా వేణు, పండు,జవ్వాజి బుచ్చిబాబు, కిలారు ప్రసాద్, సలిశo శ్రీను, పోపూరి అజయ్, బిట్రా బ్రహ్మం, మిరియాల రత్నకుమారి, జరీనాసుల్తానా, అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి, షేక్ హనీఫా, బిట్రా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment