ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరవనిత
శ్రీమతి ఇందిరా గాంధీ
చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు తొలి భారత హోం శాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేసి సువిశాల భారత నిర్మాణానికి బంగారు బాటలు వేయడం ద్వారా భారత దేశపు ఉక్కు మనిషి గా చరిత్ర పుటల కెక్కారని భారతీయుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి ఎం రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి సందర్భంగా జేజేలు పలికారు భారతదేశం తొలి మహిళా ప్రధానమంత్రి అలీన ఉద్యమ నేత 21వ శతాబ్దపు అత్యున్నత మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు శ్రీమతి ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చేయాలని మూడు రంగుల జెండా రెపరెపలలో మాత్రమే భారత దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని అన్నారు తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి బీజం వేయగా
మలి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చి వ్యవసాయ రంగానికి రైతన్నలకు అండగా నిలిచారని శ్రీమతి ఇందిరా గాంధీ హరిత విప్లవ సాధన ద్వారా భారతదేశాన్ని ధాన్యాగారంగా తీర్చిదిద్దారని రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయకరణ వంటి అంశాలతో దేశ ప్రజల హృదయాలలో అమ్మగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని వేనోళ్ళ కొనియాడారు శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి గోవిందు శంకర్ శ్రీనివాస్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దు మాల ప్రసన్న ఆంజనేయులు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నస్రుద్దీన్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ పొనుగుబాటి క్రాంతి కుమార్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవానీ వెంకటేష్ మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు గణపవరపు సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ నాయకులు కేతావతు సాంబశివ నాయక్ వి రాజు నాయక్ బండారు కుమార్ బాబు మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాం బాబు మండల కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు షేక్ ఖాజాబుడే పట్టణ కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు అన్నపరెడ్డి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment