భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.
★ 30.10.2020 శుక్రవారం నాడు నవతరం పార్టీ నూతన కార్యాలయాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
★ భీమవరం అసెంబ్లీ కన్వీనర్ ఆర్.నాగార్జున, తణుకు అసెంబ్లీ కన్వీనర్ పూడి విజయ భాస్కర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రత్యేక హోదా,రాజధాని అమరావతి కోసం నవతరం పార్టీ కృషి చేస్తామని తెలిపారు.
★ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల సమయం వరకు పార్టీ నిర్మాణానికి సంబంధించి అభిప్రాయాలను సేకరించారు. మండలాల వారీగా నేతలతో సమావేశం నిర్వహించారు.
★ సమావేశానికి నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యంకి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మండల అడహాక్ కమిటీలు కన్వీనర్లు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment