అసిస్ట్ ఆధ్వర్యంలో 4 లక్షల విలువచేసే నిత్యావసరాల పంపిణీ
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్ ఆధ్వర్యంలో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసరాలను 342 మంది మానసిక మరియు అంగవైకల్యం గల వికలాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ డీ.రవీంద్ర పాల్గొని వారి చేతుల మీదగా వీరికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ కరోనా సమయంలో వికలాంగులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న అసిస్ట్ సేవలు అభినందనీయమని తెలిపారు. గతంలో వీరందరికీ నియ్యవసరాలు పంపిణీ చేసి మరలా పంపిణీ చేయడం వారి దాతృత్వానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జాష్టి రంగారావు, అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్, డిప్యూటీ డైరెక్టర్లు రామారావు, రవి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment