చంగిస్‌ఖాన్‌పేట రైతుల ఇనాంభూముల సమస్య సత్వర పరిష్కార కోసం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముమ్మర కృషి
-జిల్లా కలెక్టర్‌కు రైతుల ఆవేదనను విన్నవించిన శ్రీకృష్ణదేవరాయలు
-ప్రజలతో అనునిత్యం మమేకమయ్యే ఎంపీ చొరవ, కలెక్టర్ హామీ పట్ల రైతులు హర్షం
చిలకలూరిపేట నియోజకవర్గం, ఎడ్లపాడు మండలం, చంగీస్‌ఖాన్ పేట రైతుల 500ఎకరాల ఇనాం భూముల సమస్య సత్వరం పరిష్కారం అయ్యి, వారికి మేలు జరిగేందుకు..నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే.. అత్యధికంగా చంగీస్‌ఖాన్ పేటలో ఇనాంభూములను రైతులు కలిగి ఉన్నారు. 2013లో తీసుకొచ్చిన కొత్త సవరణ చట్టంతో ఈ రైతుల భూములు 22(ఏ) కింద, వెన్నుముద్దల వేణుగోపాల స్వామి గుడి పరిధిలో నమోదుకాబడ్డాయి. దీంతో రైతులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా భూమిని కలిగి ఉండి, వీటిలో వ్యవసాయాన్ని చేసుకుంటూ, భూములను లావాదేవీలు చేసుకున్న వీరికి కొత్త సవరణ చట్టంతో ఇబ్బంది తలెత్తింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 22(ఏ)కింద భూములు నమోదం కావటం వల్ల.. రిజిస్ట్రేషన్లు అవ్వక, కష్టించి పండించిన పంట సాఫీగా అమ్ముకోవటానికి వీలు కలగక అగచాట్లు పడుతున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకి రైతులు విన్నవించారు. వాస్తవానికి మా భూములు 2013 చట్టంలోని నిబంధనల కిందకు రావని, మా వద్ద ఆదారాలను పరిశీలించి, 22( ఏ) నుండి మా భూములను తొలగించేలా.. మాకు న్యాయం జరిగేలా సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఈనెల 20వ తేదీన కొండవీడు గ్రామం పర్యటనకు వచ్చిన ఎంపీకి రైతులు సమస్యను తెలిపారు. రైతుల బాధను అర్థం చేసుకున్న ఎంపీ..మీ భూముల సమస్యను సీఎం జగన్ మోహన్ రెడ్డి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సమస్యకు త్వరగా పరిష్కారం దక్కేలా.. ఎంపీ తన ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా.. సోమవారం(ఈరోజు) జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ వద్దకు రైతులతో కలసి వెల్లి విషయాన్ని వివరించారు. సుమారు గ్రామం నుండి 50మంది రైతులు కలెక్టర్‌ను కలిసారు. ఎంపీ విన్నపం మేరకు స్పందించిన కలెక్టర్.. రెండు మూడు రోజుల్లో రైతుల వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
0 comments:
Post a Comment