ఇన్నర్ వీల్ క్లబ్ఆధ్వర్యంలో చిన్నారులకు ఆరోగ్య, విద్య, పరిశుభ్రత సంబంధించిన వస్తువులు అందజేత.
ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రోటరీ క్లబ్ హాలు నందు ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా చైర్మన్ సులోచన మాధు ర్ సూచనల మేరకు 50 మంది చిన్నారులకు ఆరోగ్య, విద్య, పరిశుభ్రతకు సంబంధించిన వస్తువుల కిట్లను అందజేసినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు పోతినేని పద్మ తెలిపారు. సుమారు 15 వేల రూపాయల విలువ చేసే ఈ కిట్లను చిన్నారులకు అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ ఆన్ లైన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య సంబంధమైన సూచనలు చేశారు. అనంతరం కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించే వీడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గింజుపల్లి సుశీల, కోలా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment