ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆపద్బాంధవులు
(బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సహాయాలు సేవలు వెలకట్టలేనిది కారంపూడి ప్రజల ప్రశంస)
గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలోని స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఆ స్కూల్ కి చెందిన పూర్వవిద్యార్థులు (1996-97) బ్యాచ్ అందరూ కలసి కారంపూడి కి చెందిన ఆవుల. నీలావతి అనే నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ప్రసవం తర్వాత ""లివర్ ప్రాబ్లెమ్ ""తో బాధపడుతోంది అనే విషయాన్నీ తెలుసుకున్న (1996-97)పూర్వవిద్యార్ధిని విద్యార్థులు అందరూ కలసి దాదాపు 36000/-ల ఆర్ధిక సహాయం ఆ లివర్ బాధితురాలి కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆ దేవుడు దయ వళ్ళ తమ బ్యాచ్ లో అందరూ ఒకే మాటపై ఉంటూ తమకి తోసినంతగా తోటివారికి సహాయం చేస్తున్నామని మనతోపాటు మనచుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అని చెప్పిన ఉపాధ్యాయులు మాటలనే ఆదర్శంగా తీసుకొని సహాయం ఇబ్బందిలో . ఆపదలో. ఉన్నవారికి తమకు చేతనైనంతగా గతంలో కూడా చేశాము చేస్తున్నాము భవిష్యత్తులో కూడా చేస్తామని ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు షేక్. మోదింసా, షేక్. ఆరిఫ్, సి హెచ్. వీరేంద్ర, సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, షేక్. అబ్దుల్ ఖయ్యుమ్, కొల్లి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment