గుంటూరు జిల్లాలో వడ్డీ వ్యాపారి అరాచకం
గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో వడ్డీ వ్యాపారి అరాచకం.. పరమేశ్వరరావు అనే వడ్డీ వ్యాపారి రూ.2 లక్షల కోసం కుటుంబాన్ని నిర్బంధించాడు. దంపతులతో పాటు ఇద్దరు పిల్లల్ని ఆయన నిర్బంధించాడు. ఆ కుటుంబాన్ని గదిలో ఉంచి నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టాడు. అంతేకాక మహిళ ఒంటిపై వాతలు పెట్టి ఖాళీ నోటుపై సంతకాలు పెట్టించుకున్నాడు. దంపతులతో సంతకం పెట్టించుకున్న వడ్డీ వ్యాపారి ఇల్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. జరిగిన ఈ విషయంపై ఆ కుటుంబం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
0 comments:
Post a Comment