జ్యోతిరావు పూలేను నమస్కరించుకోవడం పూర్వజన్మసుకృతం: అన్నం శ్రీనివాసరావు.
: భారతీయ జనతా పార్టీ కార్యలయం లో పార్టీ శ్రేణులు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ అన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ పూలే గొప్ప రచయిత అని సంఘ సంస్కర్త అని ఆ రోజుల్లోనే కులాల పట్ల అందరూ సమానులే అని బడుగు బలహీన వర్గాల పై జరుగుతున్న అన్యాయాలపై పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయాలతో అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ ఫలాలు అందాలి అన అంత్యోదయ అనే సిద్ధాంతం ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారధ్యంలో ముందుకు సాగుతోందని ఆయన తెలియజేసినారు ఈ కార్యక్రమానికి పట్టణ ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు డి.పుల్లయ్య యువ మోర్చా పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, జిల్లా నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్, పొత్తూరి బ్రహ్మానందం,కార్యలయం కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ, వంకాయలపాటి వంశీధర్,తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment