కుల నిర్మూలన కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే కు ఘన నివాళి. మిత్రా సర్వీస్ సొసైటీ సభ్యులు.
చిలకలూరిపేట:మిత్రసర్వీస్ సొసైటీ కార్యలయం లో మహాత్మ జ్యోతిరావు పూలే 130 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.అనగారిన వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే సమాజంలో కుల వ్యవస్థను నిర్మూలించాలని, విద్యాబుద్ధులు అభ్యసించాలని, అప్పుడే సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారని చెప్పిన మహనీయులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మిత్రా అధ్యక్ష ,కార్యదర్శులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, దేవరకొండ నాగేశ్వరరావు, కోశాధికారి గంజి బాలసుబ్రమణ్యం, అనపర్తి వెంకట్, రాచపూడి వెంకట్, కొరివి రంగయ్య, మురుగ ల గోపి, నాని తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment