తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి
- జవ్వాజి మదన్ మోహన్, గుర్రం నాగ పూర్ణ చంద్ర రావు
నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని రైతు నాయకులు చిలకలూరిపేట మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ గారు , గుర్రం నాగ పూర్ణ చంద్ర రావు గారు డిమాండ్ చేశారు. లక్షల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్రంలో వరుసగా వస్తున్నా విపత్తుల దెబ్బకు అన్నదాత కన్నీరు ,మున్నీరు అవుతున్నారు. ఇటీవల కృష్ణ, గోదావరి నదులకు వచ్చిన వరద ముప్పు కు రైతాంగం దెబ్బతినగా, వారికి ఇప్పటివరకు నష్టపరిహారం అందించడం జరగలేదని, తాత్కాలిక ఉపశమనం క్రింద 500/-రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అక్టోబర్ లో పంట నష్టం సంభవిస్తే, నేటి వరకు పంట నష్టం అంచనాలే పూర్తి కాలేదని తెలిపారు. మరి ఇప్పుడు లక్షల ఎకరాలలో సంభవించిన నష్టాన్ని ఈ అసమర్థ ప్రభుత్వం ఎప్పటికీ అంచనాలు రూపొందించి, అన్నదాతలకు నష్టపరిహారం అందించాలని విమర్శించారు . నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 60,000 వేల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment