‘కులవివక్ష’కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తత్తవేత్త, మహాత్మా జ్యోతిబారావ్ పూలే గారి 130వ వర్ధoతి సందర్భంగా, ఘన నివాళులు అర్పించిన: టిడిపి నేతలు
చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబారావ్ పూలే గారి 130వ వర్ధoతి సందర్భంగా, చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు, బిసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పిoచారు. అనంతరం కార్యక్రమానికి, విచ్చేసినవారికీ స్వీట్లు పoపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, మహాత్మా పూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రకు చెందిన కార్యకర్త, ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త మరియు రచయిత మరియు సామాజిక సంస్కరణ, మహిళా సాధికారత మరియు విద్య పట్ల ఆయన చేసిన కృషికి ప్రసిద్ది. అంటరానితనం మరియు కుల వ్యవస్థను నిర్మూలించడం, మహిళలను విముక్తి చేయడం మరియు హిందూ కుటుంబ జీవిత సంస్కరణల కోసం కృషి చేశారు. 1873 సెప్టెంబరులో, పూలే తన అనుచరులతో కలిసి ఆర్థికంగా వెనుకబడిన వారికి మరియు అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు సాధించడానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడతారు. పూలే భారతదేశంలో మహిళల విద్యకు మార్గదర్శకులు. పూలే భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 ఆగస్టులో ప్రారంభించారు మరియు తరువాత మహర్ మరియు మాంగ్ దళిత కులాల నుండి పిల్లల కోసం పాఠశాలలను ప్రారంభించారు. అతను వితంతువుల పునర్వివాహంలో విజయం సాధించారు. దేశంలో కులవివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారు. ఈ కార్యక్రమంలో షేక్ కరిముల్లా, భీమవరపు సుబ్బారావు, ఇనగంటి జగదీష్, పఠాన్ సమద్ ఖాన్, చేవూరి కృష్ణమూర్తి, షేక్ జమాల్ బాష, గుమ్మా ప్రసాద్, ఒంటిపులి వెంకట్, మాధవసింగ్, ఏలూరి నాగేశ్వరరావు, షేక్ ఫిరోజ్, షేక్ జరీనా సుల్తానా, చెన్నంశెట్టి ఏడుకొండలు, గేరా రాజశేఖర్, S.A..N. రాజ, మామిళ్ళపల్లి పోతురాజు, అంబటి సోంబాబు, మురకొండ మల్లిబాబు, జంగా వినాయకరావు, ఏలూరి తిరుపతయ్య, షేక్ బాజీ, మద్దుమాల రవి, పిల్లి కోటి, తాడిమళ్ళ సుందరయ్య, లోక బ్రహ్మయ్య, సలిసం శ్రీనివాస రావు, జవ్వాజి బుచ్చిబాబు, బొంతా వేణు, తన్నీరు పుల్లారావు తదితరలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment