ఓకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతిగా కొనసాగించాలి, విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఓకే చోట ఉండాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లామ్ జయబాబు అధ్యక్షత వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో 26.12.2021 ఆదివారం సాయంత్రం జరిగింది. కార్యక్రమంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భౌగోళికంగా అమరావతి మాత్రమే రాజధాని గా కొనసాగించే అర్హత ఉన్న ఏకైక ప్రాంతంఅని భిన్నాభిప్రాయాలు అక్కర్లేదు అన్నారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు పేరుతో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న నాటకాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ తిరుపతి లో అమరావతి రాజధాని రైతుల సభ విజయవంతం కావడమే దానికి ఉదాహరణ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో నవతరంపార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్,ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేతలు నందిపాటి శ్రీనివాస్,సి హెచ్ హేమలత,ఎలీషా, పెటేటి శ్రీనివాసరావు,చిలక రూబెన్,రెల్లి కుల నేత నాగేంద్ర రావు, హైకోర్టు న్యాయవాది యలమంచిలి రామకృష్ణ,జైఆంధ్ర ఉద్యమకారులు గరిమెళ్ళ వెంకట రాంప్రసాద్,సిరిపురపు ఫ్రాన్సిస్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గింత శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Monday, December 27, 2021
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment