ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 33 వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. మొదటగా విశ్వనాథ్ సెంటర్ లో గల రంగా గారి విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డరోడ్డు సెంటర్ లో గల రంగా విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా అని, ఈ రాష్ట్రంలో జైలు గోడల మధ్య ఉండి శాసన సభ్యులు గా ఎన్నికైన వ్యక్తి రంగా గారు ఒక్కరే అని, పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టైంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని రాజకీయ శక్తులు కుట్రపన్ని,రంగా గారిని అంతమొందించారని కానీ పేద ప్రజల హృదయాలలో రంగా గారి పై అభిమానాన్ని మాత్రం ఎన్ని కుట్రలు పన్నినా చెరిపి వేయలేరని అన్నారు. వారి యొక్క ఆశయ, సాధన కోసం నిరంతరం పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చుకోలా బ్రహ్మ స్వాములు, మునీర్, గల్లా వెంకట్రావు, కుంచనపల్లి సాంబశివరావు, పత్తి సాంబశివరావు, ఖాదర్ బాషా, అచ్చు కోలాశేషు, తోటకూర రమేష,యోబు, పెద్దిరెడ్డి సుమలత, కరిముల్లా, పసుపులేటి సాయి, సాయి బుజ్జి, గళ్ళ పూర్ణచందర్రావు, మరియు జనసేన పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment