విద్యార్దిని పరామార్శించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం
అన్ని విధాల ఆదుకుంటామని హామీ
కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ధి తల్లిదండ్రులు
23సిపిటి07: కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్ధి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మహేశ్వరి
చిలకలూరిపేట:
తమ బాబు వంశీకృష్ణ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన సహకరించిన తమకు అన్ని విధాల అండగా నిలిచిన అందరికి విద్యార్ధి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం పట్టణంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సం చదువుతున్న వంశీకృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. ఇతను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్ధి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకొని, విద్యార్ది తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యార్ధి చికిత్స కు అయ్యే ఖర్చును తామే భరిస్తామని, మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలకు హామీ ఇచ్చారు. విద్యార్ధి వంశీకృష్ణ చదువు కొనసాగించటానికి సహకరిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా విద్యార్ది తల్లిదండ్రులు విద్యాసంస్థల యాజమాన్యానికి, ఇందుకు సహకరించిన విద్యార్ది, ప్రజా సంఘాల నాయకులకు, మీడియా ప్రతి నిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
---------------------
0 comments:
Post a Comment