జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేష్ నంద
చిలకలూరిపేట.. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో చేబ్రోలు వెంకటేష్ నంద కి నియోజకవర్గ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఆయన నియామిక పత్రాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు మాదాసు పృథ్విరాజ్ ( సాయి ) ,పట్టణ అధ్యక్షుడు రాచపుడి వెంకట్ , కొండ్రముట్ల నాగేశ్వరరావు , చేతుల మీదగా అందు కోవడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ నందా మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం తో ఇచ్చిన పదవి తో నియోజకవర్గ బిసి యువత బలోపేతం కోసం కృషి చేస్తా అని ఆయన అన్నారు . ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు మాదాసు సాయి తేజ , యువజన నాయకులు పల్లపు శివపోలయ్య ,క్షత్రియ బాబి సింగ్ , చిట్యాల బ్రహ్మారెడ్డి , క్షత్రియ సాయి సింగ్ , షేక్ ఆరిఫ్ , పల్లపు కృష్ణ , కొండే పార్టీ వెంకయ్య , షేక్ అహ్మద్ , గోలి నాగరాజు , గోలి ఉదయ్ శంకర , షేక్ బాజీ ,అట్లూరి పవన్ కుమార్ , షేక్. సులేమాన్ , తుర్లపాటి శ్రీనివాస రావు , పిల్లుట్ల హనుమాన్ ప్రసాద్ , పిల్లుట్ల అనిల్ కుమార్ , చేబ్రోలు ప్రభు కుమార్, తదితరులు పాల్గొన్నారు....
0 comments:
Post a Comment