*తమ పోరాటాలు ఫలించాయి*
*లక్షలాదిమంది మాదిగ కులస్తులకు,59 ఉప కులాలకు మేలు*
చిలకలూరిపేట: షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు లో వర్గీకరణ ఉండాలని మూడు దశాబ్దాల పైగా చేసిన పోరాటాలు ఫలించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ అన్నారు. ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలతో కూడిన దర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం ద్వారా లక్షలాదిమంది మాదిగ కులస్తులకు,59 ఉప కులాలకు మేలు జరగబోతుందని తెలిపారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు లో క్రీమి లేయర్ ప్రవేశ పెట్టాలని తద్వారా ఎస్సీ, ఎస్టీ లో పేదలకు రిజర్వేషన్ ఫలితాలు అందుతాయనే భావనతో తాము ఏకీభవిస్తుందన్నారు. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని , తద్వారా అనేక దశబ్దాలుగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ ఫలితాలు మాదికులకు, ఉప కులాలకు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ప్రారంభం నుండి ఆయా ఉపకులాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే అవకాశం ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడిందన్నారు.
0 comments:
Post a Comment