కౌన్సిలర్ల పై చురకలు అంటించారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని.
మాజీమంత్రి విడదల రజిని కాలువ అలైన్మెంట్ మార్చారు... ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోరా: గంగా శ్రీనివాసరావు.
పట్టణం మన పరిధిలో ఉందా (లేక) అదుపు తప్పిందా.. కౌన్సిలర్ వలేటి వెంకటేశ్వరరావు. (హాస్యం)
ఉగ్రదాడి చనిపోయిన కుటుంబాల కోసం సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు,అధికారులు.
సూర్య న్యూస్ /చిలకలూరిపేట:
ప్రజా సమస్యల గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చేయడం లేదని టిడిపి,వైసిపి కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. పట్టణంలోని మైలవరపు గుండయ్య కౌన్సిల హాల్లో బుధవారం సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముందుగా ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాల కోసం సంతాపం తెలియజేశారు.34వ వార్డు కౌన్సిలర్ వి.కోటా నాయక్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరుతోటి ఎన్నార్టీ సెంటర్ నుంచి మొదులుకొని పాత జూనియర్ కళాశాల వరకు తొలగించారు. తిరిగి దుకాణాలు నిర్మించి ఎప్పుడు ఇస్తారని తెలిపారు. జగనన్న కాలనీలో కంపచెట్లు ఎక్కువగా ఉన్నాయి వాటిని తొలగించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణకు పుష్ కార్టులున్నాయి. అవి ఏమయ్యా అని, సదరు డ్రైవర్లు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందని, జీతభత్యాలు చెల్లించార లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరిబాబు మాట్లాడు కాంట్రాక్టర్ పద్ధతిన గతములో చేయడం జరిగిందన్నారు. పేదలకు దుకాణాలను నిర్మించి ఇస్తామని, కంపచెట్లను తొలగించే విధంగా త్వరలోనే చేస్తామన్నారు. మరో వైసీపీ కౌన్సిలర్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధ్యక్షా పట్టణం మన పరిధిలోనే ఉందా.. లేక అదుపు తప్పిందా అని హాస్యస్పదంగా మాట్లాడంపై కౌన్సిల్ సమావేశంలో ఒక్కసారిగా నవ్వుల వర్షం కురిసినట్లుగా అయింది. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ మాట్లాడుతూ విశ్వనాధ్ సెంటర్లో తొలగించినటువంటి చెట్టును పండరీపురంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల వద్ద ఉంచామన్నారు. గతంలో పార్కులో తొలగించినటువంటి వేపచెట్టు మోద్దులు ఏమయ్యాయో తెలపలేదు, హిందువులకు అత్యంత ఆరాధ్యంగా భావించే రావి చెట్టు తొలగించటం పై చైర్మన్ అసహనం వ్యక్తం చేస్తూ మునుముందు ఇలాంటి జరగకుండా అధికారులు చూడాలన్నారు. కౌన్సిలర్ చెమిడిగంటి పార్వతీ, కూనాల ప్రమీల మాట్లాడుతూ తమ వార్డుల సమస్యలు చేయడం లేదని, సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రజా మరుగుదొడ్లులోని మల మూత్ర విసర్జన కాలువల ద్వారా పంపిస్తున్నారని, మోడరన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహకుల సైతం అదే విధంగా చేస్తున్నారన్నారు. వికాస్ పాఠశాల వద్ద మంచి నీటి లీకులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు అక్కడ పడిపోతున్నారని తెలిపారు. కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ మంచినీటిలో బ్లీచింగ్ వేయడం లేదు...మురువు కాలువలు తీసిన తర్వాత బ్లీచింగ్ చల్లడం లేదు ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు డి.ఈ.ఈ అబ్దుల్ రహీం మాట్లాడుతూ మలమూత్ర విసర్జనకు ప్రత్యేకమైన కుంటలు ఏర్పాటు చేసుకునే విధంగా సదరు వ్యక్తులతో మాట్లాడతానని తెలిపారు. మంచి నీటి సమస్యపై ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నామని, నిన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించిన ఆయా వార్డులోని మంచిని సమస్య లేకుండా చేశామన్నారు. ఇతర పనుల సంబంధించి నిధులు రాగానే చేస్తామన్నారు. కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజని రోడ్డుకు సంబంధించిన ఎలైన్మెంట్ మార్చారని, సర్వే నంబర్లు చెప్పిన,చేయడం లేదని, ప్రతి కౌన్సిల్ సమావేశంలో చెప్పిన ఎందుకు పట్టించుకోవడంలేదని,పలు ప్రశ్నలు సంధించారు. ఓల్డ్ బ్యార్ని నగర్ లోని సిల్టు అంతే ఉంచారన్నారు. రానున్న వర్షాకాలంలో కాలనీ ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే చేస్తామని తెలిపారు.మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ సమావేశంలోనే ప్రజా సమస్యలు మాట్లాడడమే కాకుండా ఇతర సమయాలలో అధికారుల ద్వారా ఎందుకు,అభివృద్ధి పనులు చేయించుకోలేకపోతున్నారని కౌన్సిలర్లకు చురకలు అంటించారు. సకాలంలో పనులు చేయకపోతే కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీయాలన్నారు.
*కౌన్సిల్ అజెండా ఏకపక్షంగా ఆమోదించారు.. ప్రశ్నించ లేక బయటకు వచ్చిన వైసిపి కౌన్సిలర్లు.
మున్సిపల్ కౌన్సిల్ అజెండాలో మొత్తం 37 అంశాలను పొందుపరిచారు. అందులో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి దుకాణాలు పునరుద్ధరణ సంబంధించి, మరి కొన్ని షాపులకు సంబంధించి అనుమతుల కోసం కౌన్సిల్ ఆమోదం కొరకు పొందుపరిచారు. అదేవిధంగా(ర్యాడిఫికేషన్)
అత్యవసర పనుల పేరిట మంచి నీటి పైపులైన్లు, ఇతర మరమ్మత్తులు,విధి దీపాలు, పార్కుల అభివృద్ధి, ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులతో పాటు పసుమర్రు గ్రామ సర్వేనెంబర్లో లేఅవుట్ లేకుండా కొంతమంది వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. దీనితో పాటు మరికొన్ని అంశాలపై మాట్లాడవలసి ఉన్నా వైసిపి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ అజెండాను ఆమోదిస్తూ బెల్లు కొట్టగానే బయటికి వచ్చేశారని, పలువురు కౌన్సిలర్లు చర్చించుకోవడం గమనార్హం.
0 comments:
Post a Comment