ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.1886లో అమెరికాలోని చికాగోలో* హే* అనేటువంటి మార్కెట్లో 18 గంటలు పని చేయడం నుండి సమయం తగ్గించాలని మొదలైన ఉద్యమం ఆరుగురు కార్మికులు ఏడుగురు పోలీసులు చనిపోవడం, తర్వాత కార్మికుల నాయకుల్ని నలుగురిని ఉరి తీయడం తో మొదలైన ఈ ఉద్యమం యూరప్ దేశాల్లో మొట్టమొదటిసారిగా మే 1 న సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.మన భారతదేశానికి 1923న మద్రాస్ రాష్ట్రంలో "కిసాన్ పార్టీ ఆఫ్ ఇండియా" వారు మొట్టమొదటిగా సెలవుదినంగా ప్రకటించడం తరువాత భారతదేశమంతటా సెలవు దినంగా ప్రకటించటం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి కార్మికుల ఐక్యత కోసం కార్మికుల ఉన్నతి కోసం మానవ హక్కుల సంఘం తరఫున సంఘీభావ ర్యాలీని చేయటం జరిగింది ర్యాలీలో పాల్గొన్న అందరికీ చైర్మన్ అబ్దుల్ మునాఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
0 comments:
Post a Comment