చిలకలూరిపేట లైసెన్సుడ్ సర్వేయర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిలకలూరిపేట లైసెన్సుడ్ సర్వేయర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు ఇంజనీర్ శ్యామ్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణంలోను, పరిశ్రమలలోను, మైసూర్ బ్యాంక్, మైసూర్ శాండిల్ సోప్ వంటివి అనేకం స్థాపించడంలోనూ ఆయన పాత్ర కీలకమైనది అని అన్నారు. నేటితరం ఇంజనీర్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
హైదరాబాద్ నిజాం దగ్గర పనిచేసినప్పుడు మూసి నది వరదల నుంచి నగరాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆర్కిటెక్ట్ జబ్బర్ జబ్బార్ అన్నారు.
పదవీవిరమణ చేసిన రోజున శ్రీ విశ్వేశ్వరయ్య తన అధికారిక వాహనాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారని, ఇలా ఆయన విలువలతో కూడిన సాదాసీదా జీవనాన్నే గడిపారని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ చంద్ర, శ్రీనివాస్, మధు, న్యాయవాది భాను ప్రసాద్, సాదిక్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు..
0 comments:
Post a Comment