చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న సంచార విద్యార్థుల వారికి వారి ఆరోగ్య అవసరాల నిమిత్తం విటమిన్ మాత్రల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరావు పాల్గొని మాత్రలు పంపిణీ చేయడం జరిగింది, ట్రస్ట్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో తి రుగుతూ ఉండే సంచార జాతుల వారు అనేక అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అని వారి పిల్లలకు పెద్దలకు విటమిన్ మాత్రలు పంపిణీ చేశామని తెలియజేశారు, ముఖ్యంగా చిన్నపిల్లలలో ప్రస్తుతం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వరాలు అధికంగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని వారి కోసం మాత్రలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు జయ జయ సాయి ట్రస్ట్ తరఫున ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు
Sunday, September 15, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment