728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, September 28, 2024

విజయవాడ వరద బాధితుల కోసం మోటార్ వెహికల్స్ అసోసియేషన్ విరాళం








స్వయం ఉపాధికి కొండంత అండగా కేంద్ర పథకాలు: ప్రత్తిపాటి*

*విజయవాడ వరద బాధితుల సహాయార్థం మోటార్ వెహికల్ అసోసియేషన్ విరాళం*

*ప్రత్తిపాటి పుల్లారావుకు రూ.లక్ష చెక్కు అందించిన అసోసియేషన్ సభ్యులు*

పేదల స్వయం ఉపాధి, ఆర్థిక స్వాలంబనకు కొండంత అండగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం - పీఎంఈజీపీనే ద్వారానే చిన్నచిన్న వ్యాపారాలను నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాయి వరకు లబ్ది పొందే అవకాశం ఉందన్నారు. కాస్త ఆవగాహనతో వాటిని ఉపయోగించుకోగలి గితే ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్న పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ స్వప్నాన్ని త్వరలోనే చూస్తామన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ చిలకలూరిపేట మోటార్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళం అందించారు. శనివారం స్థానిక కేబీ రోడ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం వచ్చిన రూ.లక్ష చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి మోటార్ వెహికల్ అసోసియేషన్‌కు చెందిన కార్మికులు వారి కష్టాన్ని విరాళంగా అందించారని, వారు అందించింది కోట్లాది రూపాయలకు సమానమని తెలిపారు. ఇలాంటి ఎంతోమంది సహృదయంతో చేస్తున్న సాయం కారణంగానే స్వల్ప వ్యవధిలో సీఎం సహాయనిధికి 400కోట్లకు పైగా విరాళాలు సేకరించి కొత్త చరిత్ర సృష్టించగలిగామన్నారు. మోటార్ కార్మికులకు సంబంధించి స్థానికంగా ఆటోనగర్‌లో ధర తగ్గించి ఎంఎస్ఎంఈ వసతులన్నీ కల్పి స్తామని హామీ ఇచ్చారు. అవకాశం ఉన్నంతవరకు బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి కేబీ రోడ్‌లో ఉన్న ఆటోకార్మికుల్లో ఆసక్తి ఉన్న అందరిని ఆటోనగర్‌కు మార్చే ప్రయత్నం చేస్తామన్నారు.  కేబీ రోడ్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా కొంత వెనక్కి జరగమని చెప్పామని, ఎవరిని నష్టపోమని చెప్పలేదని, ఎవరైనా నష్టపోయినట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రజలు సహకరించడం వల్లనే పట్టణంలో ఒక చుక్కనీరు కూడా నిలబడకుండా చేశామన్నారు. ఒకరికి నష్టపరిస్తే వచ్చేది ఏమీలేదని, అందరు కష్టపడి తనను గెలిపించారన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం లాంటివి ఎన్నో పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాపారాలు చేసుకునే అందరికీ ఆ పథకం అందుబాటులో ఉంటుందన్నారు. బ్యాంకుల్లో సహకరించకపోతే తనతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టర్‌తో మాట్లాడి రుణ సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏడో తరగతి చదివిన తర్వాతనే బ్యాంకు రుణాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. నెల రోజుల తర్వాత బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమీక్షించిన తర్వాత లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయిస్తామని, ఎవరైతే అక్కడికి వెళ్లి చేరతారో వారికే అందిస్తామన్నారు. మొత్తం 5,520 టిడ్కో ఇళ్లు ఉన్నాయని, ఇప్పుడు 2 వేలమంది ఉంటున్నారని, మిగిలిన వారు ఎవరు చేరతామంటే వారికే ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. 300 అడుగుల ఇల్లు అయితే పూర్తిగా ఉచితమని, రూపాయి కూడా కట్టేపని లేదని, 365, 430 అడుగుల ఇంటికి మాత్రమే డబ్బులు కట్టాలని తెలిపారు. ఎన్ని వాయిదాల్లో డబ్బులు చెల్లించాలో బ్యాంకర్లతో సీఎం మాట్లాడుతున్నారని, దానిపై స్పష్టత వచ్చిన తర్వాత ఎవరు చేరితే వారికే ఇల్లు ఇస్తామన్నారు. తాము తీసుకున్నాం, అద్దెకు ఇచ్చుకుంటాం, అమ్ముకుంటామంటే కుదరదని, చేరేవారికి ఇస్తామని, అక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. అక్కడే పాఠశాల, ఆస్పత్రి, షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్, చర్చి, మసీదు, దేవాలయం, మినరల్ వాటర్ సహా అన్నీ సౌకర్యాలు ఉండేలా చేయబోతున్నామని వివరించారు. చేతివృత్తుల వారికి అక్కడే గదులు కూడా కట్టించి ఇవ్వబోతున్నామని తెలిపారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఒప్పుకోబోమని, పోలీస్ అవుట్ పోస్ట్ పెడుతున్నామని, రెండు లైన్ల రహదారి వేస్తున్నామన్నారు. రెండు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువుకు, టిడ్కో గృహ సముదాయానికి మధ్య వాకింగ్ ట్రాక్ కూడా పెడతామని తెలిపారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: విజయవాడ వరద బాధితుల కోసం మోటార్ వెహికల్స్ అసోసియేషన్ విరాళం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews