పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు.
★ ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 43 ఫిర్యాదులు అందాయి.
★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు.
*ఎస్పీ గా పదోన్నతి పొంది బదిలీ పై వెళుతున్న డి.రామచంద్ర రాజు ను ఘనంగా సత్కరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్
0 comments:
Post a Comment