చిలకలూరిపేట :విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని నాయకులు అభివర్ణించారు.మంగళవారం పట్టణ ములోని రైతు బజార్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఫ్ ,ఎస్సి,ఎస్టీ,బి.సి సంఘాల నాయకులు మాట్లాడుతూ కలలు కనండి...వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ అని కొనియాడారు. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయని అబ్దుల్ కలాం జయంతికి మనస్ఫూర్తిగాకి నివాళ్ళు అర్పించటము అదృష్టంగా భావిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇంజనీర్ గా పనిచేశారని, బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశారూ. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు.కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారన్నారు. ఈ విధంగా కలాం గురించి ఎంత చెప్పినా తక్కువేనని మనస్ఫూర్తితో ముందుకెళ్లవలసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో
బి. శ్రీను నాయక్, బి.చిన్న నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, కొండ్ర ముట్ల నాగేశ్వరరావు,బి.రాంబాబు నాయక్, సలికినిడి నాగరాజు, యం. వెంకటేష్ నాయక్, పుట్టా వెంకట బుల్లోడు, భూపని వెంకట్, పోతన బోయిన శంకర్, కాకాని రోశయ్య, కంచర్ల శ్రీనివాసరావు,కె.వాగ్యా నాయక్ ,రాచపూడి వెంకట్,కుంభ నాగేశ్వరరావు, తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment