ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు మండలనేని చరణ్‌తేజ
విశ్వ వాసు నామ ఉగాది సందర్బంగా జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్‌తేజ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి తోట రాజారమేష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసంలో జరిగిన ఉగాది పంచాగ శ్రావణ కార్యక్రమంలో పాల్గొని ఉగాది పచ్చడి సేవించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈ ఉగాది పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిక్షణం ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
0 comments:
Post a Comment