728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Wednesday, April 30, 2025

కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయాలి





కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయాలి
.

మన దేశం కోసం...కదలిరా అనే కార్యక్రమం పట్టణంలోని స్థానిక కళామందిర్ సెంటర్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా పహాల్గంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ వివిధ రాజకీయ పార్టీ నాయకులు,ప్రజాసంఘాల నాయకులు, మీడియా మిత్రులు,ప్రముఖ న్యాయవాదులు, మహిళా సంఘాల నాయకులు, వృద్ధులు,వివిధ వృత్తుల్లో అనుభవజ్ఞులైన ప్రముఖులు,పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ముందుగా చిలకలూరిపేటలోని చీరాల రోడ్ లో ఉన్నటువంటి “పాటిమీద” ప్రగతి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వేదిక వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని పహాల్గంలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు మౌనం పాటిస్తూ ఘనంగా నివాళులర్పించారు..ఆ తరువాత వేదిక  నుంచి జాతీయ జెండాలతో ర్యాలీగా కళామందిర్ సెంటర్ వరకు చనిపోయిన వారికి జోహార్లు చెప్పుకుంటూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగినది. కళామందిర్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులతో అమరులైనటువంటి వారికి నివాళులు అర్పించారు. అనంతరం రాజకీయ పార్టీ నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖ న్యాయవాదులు, మహిళా సంఘాల నాయకులు, అనుభవజ్ఞులు అయిన వృద్ధులు, వివిధ వృత్తుల ప్రముఖులు, ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ మంచి సందేశాలను అందించారు. ఉగ్రవాదం అనే పెనుభూతం ప్రపంచం మొత్తంనికి ఒక సవాలుగా మారిందన్నారు.ప్రతి ఒక్క దేశం దాని బారిన పడి నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం ముందుకు రావాలని అన్ని దేశాలు ఐక్యమత్యంతో ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందన్నారు. ఉగ్రవాదని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను ప్రపంచం మొత్తం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపైన ప్రతి ఒక్క దేశం స్పందించి  ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేస్తున్నటువంటి చర్యలను సమర్ధించి భారతదేశానికి మద్దతుగా నిలవాలని, ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే భారతదేశానికి మద్దతు తెలిపినటువంటి ప్రముఖ దేశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంతవరకు ప్రతి ఒక్క యువత ముందుకు రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయాలి Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews