728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Tuesday, April 1, 2025

అడ‌పా అశోక్‌కుమార్ మిత్రులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలుగాను ఉత్త‌మ‌సేవా పుర‌స్కారం అందుకున్న ప్రెస్‌క్ల‌బ్ నాయ‌కుల‌కు స‌త్కారం..

 



సమాజ జాగృతంలో జర్నలిస్టులు కీలకం

స‌మ‌స్య‌లు ఎత్తి చూప‌డ‌మే కాదు.. 

స‌మాజిక సేవ‌లో ముందుడ‌టం  ఆద‌ర్శ‌నీయం 

 జ‌న‌సేన పార్టీ నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ 

 అడ‌పా అశోక్‌కుమార్ మిత్రులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలుగాను ఉత్త‌మ‌సేవా పుర‌స్కారం అందుకున్న ప్రెస్‌క్ల‌బ్ నాయ‌కుల‌కు స‌త్కారం.. 


చిల‌క‌లూరిపేట‌:

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, స‌మాజంలో మార్పు కోసం ప్ర‌య‌త్నిస్తునే, స‌మాజ స‌మాజిక సేవ‌లో కూడా జ‌ర్న‌లిస్టులు భాగ‌స్వాములు కావ‌డం అభినంద‌నీయ‌మ‌ని జ‌న‌సేన పార్టీ నాయ‌కులు మండ‌లనేనిచ‌ర‌ణ్‌తేజ అన్నారు.ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఏపీయూడ‌బ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్  ప్రెస్ క్ల‌బ్ చిలకలూరిపేట అధ్యక్షులు  అడ‌పా అశోక్‌కుమార్‌, కార్యదర్శి షేక్ ద‌రియావ‌లి  ఉగాది సంద‌ర్బంగా ఉత్త‌మ సేవా పుర‌స్కారాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ అరుణ్ బాబు, జిల్లా  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు చేతులుగా  అందుకున్నారు.ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ కార్యాల‌యంలో వీరిని ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ సమాజంలో  కోట్ల మందిని కదిలించి  చైతన్యం చేసే సాధనం జర్నలిజమ‌ని, పత్రిక విలేకరులు తమ వృత్తి పట్ల వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. 

సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు పాత్ర కీలకం..

ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికిను కష్టాలు కూడా లెక్కచేయకుండా పత్రికా ప్రతినిధులు పనిచేయటం స్ఫూర్తిదాయకమని మండ‌ల‌నేని  చ‌ర‌ణ్‌తేజ అన్నారు.సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు పాత్ర కీలకంగా ఉంటుందని, సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప‌రిష్కార మార్గాలు చూప‌డంతోపాటు,సేవా కార్య‌క్ర‌మాల్లోనూ  తాము సైతం ప్రెస్ క్ల‌బ్ ప‌నిచేయ‌డం  ఆద‌ర్శ‌నీయ‌ని కొనియాడారు. స‌మ‌స్య‌ల‌ను వార్త‌లుగా మ‌ల‌చ‌ట‌మే కాకుండా, స‌మాజానికి సేవా చేయాల‌న్న సంక‌ల్పంతో  క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ  విజ‌య‌వాడ వ‌ర‌ద‌బాధితుల‌కు స‌హాయం వ‌ర‌కు అడ‌పా అశోక్‌కుమార్ మిత్రులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని వివ‌రించారు. ప్ర‌తి జ‌ర్న‌లిస్టు  సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, సామాజిక భద్రత క‌లిగి ఉండాల‌న్నారు.  జర్నలిస్టులు వారికున్న సమాచారంతో వాస్తవ కథనాలు ఇస్తుంటారని, అధికారులు, ప్రజాప్రతినిధులు పాజిటివ్‌గా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత రాగధ్వేషాలు పెంచుకోరాదని సూచించారు.ఈ కార్య‌క్ర‌మంలో సాక్షిత ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో తోట మల్లికార్జునరావు, శివనారాయణ, జన సైనికులు  జాగ్రోద్ స్వామి, గుంజి,దాసరి కొండలరావు,తదితరులు ఉన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అడ‌పా అశోక్‌కుమార్ మిత్రులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలుగాను ఉత్త‌మ‌సేవా పుర‌స్కారం అందుకున్న ప్రెస్‌క్ల‌బ్ నాయ‌కుల‌కు స‌త్కారం.. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews