728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, March 31, 2025

వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ముస్లింల నిరసన

 





వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ముస్లింల నిరసన


చిలకలూరిపేట : వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఈద్గా ల వద్ద ముస్లిం మైనారిటీ ప్రజానీకం,

ముస్లిం సంఘాలు నల్ల బ్యాడ్జిలతో శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలిపాయి.సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు కూటమి ప్రభుత్వాన్ని కోరారు.

వక్ఫ్ బోర్డు గతంలో వక్ఫ్ సవరణ బిల్లు 2024ను వ్యతిరేకించింది, దీనిని ముస్లిం సమాజం, వక్ఫ్ సంస్థలను లక్ష్యంగా చేసుకునే “తిరోగమన చర్య”గా పేర్కొంది. ఈ బిల్లు వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని నాశనం చేస్తుందని, వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తుందని బోర్డు వాదించింది. నేడు నిరసన ఆంధ్ర ప్రదేశ్ లోని మైనారిటీ వర్గాల నుంచి ప్రతిపాదిత సవరణలపై కొనసాగుతున్న ఆందోళనలు, వ్యతిరేకతను హైలైట్ చేస్తుంది. ఇట్టి కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు , ముస్లిం మైనార్టీ ప్రజలు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ముస్లింల నిరసన Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews