వేసవి సెలవులలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి ... ఏఐఎస్ఎఫ్ డిమాండ్
చిలకలూరిపేట : ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వేసవికాలంలో పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రైవేటు , కార్పొరేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం చిలకలూరిపేట ఎంఈఓ సుబ్బారావుకు ఎంఈఓ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటిస్తుంది. కానీ కొన్ని ప్రైవేటు ,కార్పొరేట్ విద్య సంస్థల యాజమాన్యాలు ర్యాంకుల కోసం, అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం, డబ్బులను దండుకోవడం కోసం వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులని తరగతి గదులకు పరిమితం చేస్తూ విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యా వ్యవస్థలలో చట్టపరమైన చర్యలు కేవలం విద్యాశాఖ అధికారుల వల్లనే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులను పక్కన పెడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి విద్య సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపులను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నాము. భావిభారత పౌరులు సొంతగా ఆలోచించే తత్వం కోల్పోతారని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇకనైనా తల్లిదండ్రులు కార్పోరేట్ వ్యవస్థ సృష్టిస్తున్న గందరగోళం నుండి మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలని మా మనవి. వెంటనే ఎవరైతే ఇంకా తరగతులు నిర్వహిస్తున్నారో వారు పద్ధతి మార్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లేదంటే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు విద్యార్థులతోనూ, వారి తల్లిదండ్రులతోనూ కలిసి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు గుడిపల్లి జగదీష్, నాయుడు సాయి శ్రీనాథ్, కంచర్ల సన్నీ, అన్నం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
0 comments:
Post a Comment