పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో
సీనియర్ విలేకరి ఈనాడు ప్రసాద్‌కు ఘన సన్మానం
ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం
చిలకలూరిపేట: ప్రజాస్వామ్య మనుగడకు నాలుగోవ స్తంభంగా నిలిచే పత్రికలు, మీడియాకు అందులో పనిచేసే జర్నలిస్టులకు స్వేచ్చ అవసరమని ఆర్‌వీఎస్ సీవీఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినోత్సవం సందర్బంగా ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు, సీనియర్ నటుడు వంకాయలపాటి ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ ఈనాడు దినపత్రికలో అత్యధిక కాలం పనిచేసి అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లటానికి దోహదపడ్డారని, ఇటీవల నటనలో రాష్ట్ర ప్రభుత్వ కందుకూరి పురస్కారం కూడా అందుకున్నారని, అటువంటిని మహోన్నత వ్యక్తిని ఎంచుకొని సన్మానం చేయడం సముచిత నిర్ణయమన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధినిర్వహణ చేయడం జర్నలిస్టులకే సాధ్యమని అన్నారు. తీవ్రమైన ఒత్తిళ్ళ నడుమ విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టులకు స్వచ్చ అవసరమని తెలిపారు. మీడియా ఎల్లప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని, ఆదే అత్యంత ప్రాధాన్యత అని వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిధి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలపట్ల, సమాజంపట్ల బాధ్యతతో వ్యవహరించాలన్నారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే జర్నలిస్టులకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈనాడు ప్రసాద్‌గా సుపరిచితుడైన ప్రసాద్‌ను సన్మానించుకోవడం తమకు గర్వంగా ఉందని, ఆయన మార్గదర్శకత్వంలో సూచనలు అందుకొని క్లబ్ సభ్యులు పయణించాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులు, క్లబ్ సభ్యులు కలిసి ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటటం జరిగింది .కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ దరియావలి, కొండపాటి రమేష్, పెనుమల మనోహర్, మర్రిపూడి వాసు, నరసింహ శ్రీకాంత్, కొచ్చర్ల చందు, నాదెండ్ల సుందరబాబు, రావిపాటి రాజా, తదితరులు ఉన్నారు.
0 comments:
Post a Comment