- అధికారంలో ఉండి కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించారు.. నేడు ప్రజల కళ్లలోని సంతోషం చూడలేకే రాజధాని వేడుకకు దూరమయ్యారు.: ప్రత్తిపాటి.
- నిత్యకల్యాణంలా జరిగే అమరావతి పనుల్ని చూస్తూ, వేధించిన రైతుల ఎదుటే తన రాజకీయ కార్యకలాపాలు సాగించాలనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి : ప్రత్తిపాటి
“ అమరావతి పున: నిర్మాణ ఘట్టాన్ని యావత్ భారతావని ఉత్సుకతతో తిలకించింది. 5 కోట్ల ఆంధ్రుల కళ్లు చెదిరిపోయేలా, అమరావతిపై అకారణంగా అక్కసువెళ్లగక్కిన వారు కళ్లలో నిప్పులు పోసుకునేలా రాజధాని సభ నభూతో అన్నట్టుగా భారీస్థాయిలో విజయవంతమైంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు, రాజధానికి అండగా ఉంటానన్న ఆయన భరోసా తెలుగుజాతిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మతృప్తిని నింపాయి. ప్రధాని ప్రసంగంపై ప్రజల్లో హర్హాతిరేకాలు వ్యక్తమవుతుండటమే దానికి నిదర్శనం. దైవానుగ్రహంతో అన్నీ అనుకూలించి, సకాలంలో అమరావతి నిర్మాణం పూర్తై, ఆ మహానగరం తమ బిడ్డలకు బంగారు భవిష్యత్ ను అందించాలన్నదే ప్రజల మనోవాంఛ.
*నిత్యకల్యాణంలా జరిగే అమరావతి పనుల్ని. రైతుల ఆనందాన్ని చూస్తూ రాజధానిలో తిరగాలనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి*
చంద్రబాబు పట్టుదల, అకుంఠిత దీక్షతో కేంద్రం చేయూతతో మూడేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తికావడం తథ్యం. ఆ మహానగరం అందించే ఫలాలు ప్రజలు అనుభవించడం ఖాయం. ముగిసిన ఐదేళ్లలో అధికార గర్వంతో అమరావతిని విధ్వంసం చేసిన వారు, లేనిపోని విషప్రచారంతో ప్రజా రాజధానిపై దుమ్మెత్తిపోసినవారు ప్రజల జయజయ ధ్వానాల మధ్య, ప్రధాని.. ముఖ్యమంత్రి ప్రసంగాల సాక్షిగా తెల్లబోయి ఉంటారు. ప్రజలు నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని జగన్ తన స్వార్థ, దోపిడీ ప్రయోజనాలకు వినియోగించుకున్నాడు. అధికారం తన జన్మహక్కు అన్నట్టుగా కన్నూమిన్నూ కానకుండా విర్రవీగుతూ, తన మాటే నెగ్గాలన్న అహంకారంతో దురుద్దేశంతో ప్రజలందరి రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు. భూములిచ్చిన రైతులు, రాజధాని ప్రాంత మహిళలపై దేశచరిత్రలో ఏ పాలకుడు వ్యవహరించని విధంగా అమానుషంగా ప్రవర్తించాడు. తప్పుడుకేసులు, అసమగ్ర చట్టాలతో వారిని చిత్రహింసలకు గురిచేశాడు. మూడు రాజధానులంలూ వారి గుండెల్లో ఆరనిచిచ్చు రేపి, ఆనందించాడు. అధికార గర్వంతో అలా చేసినందుకే ఇప్పుడు అవమానభారంతో అమరావతి సభకు ముఖం చాటేశాడు. రాజధాని రైతులకు తన ముఖం చూపించలేక ప్రధాని హాజరైన సభకు సైతం గైర్హాజరయ్యాడు. మునుముందు తాను అదే ప్రాంతంలో ఉండాలని, అక్కడి ప్రజలమధ్యనే తిరుగుతూ తన రాజకీయ కార్యకలాపాలు సాగించాలనే వాస్తవాన్ని జగన్ గుర్తించాలి. నిత్యకల్యాణంలా అమరావతిలో జరిగే పనుల్ని, రైతులు, రైతుకూలీల సందడిని చూస్తూ, ఆ ప్రాంతప్రజల మధ్యనే తలదించుకొని రోజులు గడపాలనే కఠోర వాస్తవాన్ని గ్రహించి, ఆయన గుండెనిబ్బరంతో వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో సూచించారు.
0 comments:
Post a Comment