సమాధుల కూల్చివేత ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి: టిడిపి ఎస్సీసెల్ నేతలు
దళిత, క్రైస్తవులకు చెందిన స్మశాన వాటిక యందు, గురువారం ఉదయం సమాధులను ఏకపక్షంగా కూల్చడాన్ని టిడిపి ఎస్సీసెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సమాధుల కూల్చివేత ప్రక్రియ సమాచారం తెలియగానే, పార్టీకి చెందిన దళిత నేతలు స్మశాన వాటిక వద్దకు చేరుకొని పట్టణంలోని వివిధ సంఘాల వారితో కలిసి ఆందోళన కార్యక్రమoలో పాల్గొన్నామని తెలిపారు. పురపాలక సంఘ కమిషనర్ పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాధుల కూల్చివేతతో దళితుల మనస్సులు గాయపడ్డాయని, ఎటువంటి సమాచారం లేకుండా కూల్చివేయడం కులవివక్షగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వాళ్లందరినీ కఠినంగా శిక్షించాలని, పార్టీ అధినేత దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లామని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లా పార్టీ దళిత నేతలు రేపు చిలకలూరిపేట రానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కుప్పాల లాజరు, జరుగుమల్లి చిన్నయ్య, ఇనగంటి జగదీష్, S.A.N. రాజు, గేరా రాజశేఖర్, వాడ్డాని సుబ్బారావు, బెజ్జం రవి, చెల్లిరాంబాబు, పిల్లి కోటి, నూలు రాజేష్, మద్దుమాల రవి, బొంతావేణు, తాడిమల్ల సుందరయ్య, మాణిక్య రావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment