పూర్వాపరాలు పరిశీలించకుండా అధికారుల ఏకపక్ష నిర్ణయాలు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు
అడపా మోహన్ మాదిగ....
శ్మశాన వాటిక అన్యాక్రాంతం అయిందని సంవత్సరాలు గా అధికారులు చుట్టూ తిరిగిన...?
చిలకలూరిపేట: అభివృద్ధి పేరిట షెడ్యూల్డ్ కులాలకు చెందిన స్మశాన వాటిక ధ్వంసం చేశారని,పట్టణంలో జాతీయ రహదారి వెంబడి, షెడ్యూల్ తెగలకు చెందిన వారికి,పురుషోత్తమ పట్నం,సర్వే నెం 94/సి లో విస్తీర్ణం1,84 సెంట్లు శ్మశాన వాటికకు
కేటాయించిన,శ్మశాన వాటిక ఆక్రమణకు గురి అయినందున ఆక్రమణలు తొలగించి అన్యాక్రాంతం అయినా భూమిని స్మశానమునకు కేటాయించి, సంఘం నాయకుల పరిశీలనలో అభివృద్ధి పరచ వలసినదిగా తను అప్పటి చిలకలూరిపేట తహశీల్దార్ కు జిల్లా కలెక్టర్ గుంటూరు,వారికి ఆర్, సి, నెం,327/2017/సి...ఎండర్స్ మెంటూ చేసి 1 ది'01,05,2017,తేదీన అర్జీ పెట్టటం జరిగిందని, అర్జీ నెంబర్ ,20177-7436617,దాఖలు పరచగా,జిల్లా కలెక్టర్,వారి సూచనల మేరకు,తహసీల్దార్, మునిసిపల్ కమిషనర్ లను కలిసి,ఆర్,ఓ,సి, నెం 86809/2017/జి1,23,0617 తేదీన,
అన్యాక్రాంతమైన భూమి వివరాలను వినతి పత్రం ద్వారా తెలియజేశామని,ఎమ్మార్పీఎస్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ తెలిపారు, నాటినుండి నేటివరకు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తాసిల్దార్ కార్యాలయం చుట్టూత తిరుగుతున్న అధికారులు అన్యాక్రాంతమైన భూమిని సర్వే చేయకుండా అభివృద్ధి పరచకుండా కాలయాపన చేశారన్నారు
ఇవన్నీ మున్సిపల్ అధికారులకు రెవెన్యూ అధికారులకు తెలిసిన అన్యాక్రాంతమైన భూమిని పరిరక్షించటం చేయకుండా ఆగమేఘాలపై షెడ్యూల్ కులాలకు చెందిన మతపెద్దలకు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున స్మశాన వాటిక లోని కొన్ని మహిమాత్ముల సమాధులను ను తొలగించుట ఎంత వరకు సమంజసమని మోహన్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు షెడ్యూల్ కులాలకు చెందిన వారి మనోభావాల పట్ల అధికారులు వివక్షతను చూపటం భావ్యం కాదన్నారు అభివృద్ధి పేరిట షెడ్యూల్ కులస్తుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు ఇవే కాకుండా పట్టణంలో షెడ్యూల్ కులస్థుల భూములు అన్యాక్రాంతమైన విషయం తను అధికారుల దృష్టికి తెచ్చి ఉన్నానని వాటిని తాసిల్దార్ గ్రామ రెవెన్యూ అధికారి మండల సర్వేర్ తో సర్వే జరిపి షెడ్యూల్డ్ కులస్తులకు చెందిన అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించి షెడ్యూల్ కులస్తులకు అభివృద్ధి పరచుటకు ఉపయోగించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మోహన్ మాదిగ డిమాండ్ చేశారు,అలానే తక్షణమే స్మశాన వాటికలో కూల్చివేసిన మహిమాత్ముల సమాధులను పునర్నిర్మాణం జరపాలని ఇది పూర్తిగా దుశ్చర్యకు పాల్పడిన అధికారులే చేయాలని షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారితో సంప్రదించకుండా ఇటువంటి ఘటనకు పాల్పడిన అధికారుల పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మశాన వాటిక కు కేటాయించి అభివృద్ధి పరచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు అడపా మోహన్ మాదిగ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment