శివసేన,అకాలీదళ్ అవుట్...
వైఎసార్సీపి ఇన్...
కేంద్ర క్యాబినెట్లోకి వైఎసార్సీపి...
రాష్ట్ర క్యాబినెట్లోకి బీజేపీ... కేంద్ర మంత్రిగా విజయసాయి రెడ్డి...?
రాష్ట్రమంత్రి గా సోము వీర్రాజు...
మోదీ,జగన్ సమావేశంలో కీలక చర్చలు...
ప్రత్యేకహోదా ఉసెత్తకూడదు అనే ప్రధాన ఒప్పందంతో ఎన్డీయేలో చేరేందుకు వైఎస్సార్సిపి కి గ్రీన్ సిగ్నల్...
బీజేపీ,శివసేన,అకాలీదళ్ మైత్రి ఈనాటిది కాదు.కానీ ఇప్పుడు మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలన ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు ఒక్కొక్కటిగా బీజేపీ కి దూరమవుతున్నాయి.సుదీర్ఘకాలం ఎన్డీయే కి మద్దతు ఇచ్చిన శివసేన,అకాలీదళ్ బీజేపీ పై కత్తిదూస్తున్నాయి.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి వీస్తున్న అనుకూల పవనాలు,రాహుల్ గాంధీ పుంజుకోవడం బీజేపీ ని డిఫెన్స్ లోకి నెడుతున్నాయి.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైఎస్సార్సిపి చీఫ్ జగన్ సిద్ధమయ్యారు.అందరూ బీజేపీ కి దూరమవుతున్న సమయంలో ఎన్డీయే లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అందులో భాగంగానే మోదీతో భేటీ అవ్వనున్నారు అని ఢిల్లీ లోని వైఎసార్సీపి ముఖ్యనేతలు అంటున్నారు.ఇప్పటికే పలుమార్లు ఇరుపార్టీల ముఖ్యనేతల సమావేశం జరిగింది.ఇక చివరి కీలక సమావేశం ప్రధాని సమక్షంలో జరగనుంది.ఈ కలయిక లో భాగంగా వైఎసార్సీపి కి కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ దొరకనుంది.ఒక కేంద్ర మంత్రి పదవి,కేంద్ర సహాయ మంత్రి పదవి లభించనుంది.కేంద్ర మంత్రిగా విజయసాయి రెడ్డి కి అవకాశం దక్కనుందని సమాచారం.ప్రతిగా రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు బీజేపీ కి ఇవ్వనుంది వైఎసార్సీపి.అందులో ఒక పదవి కి సోము వీర్రాజు పేరు ఖరారు అయ్యినట్టు సమాచారం.మరో పదవికి అధిష్టానం ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు.దేశ వ్యాప్తంగా పార్టీ వీక్ అవుతున్న సమయంలో జగన్ బీజేపీ కి మద్దతు ఇచ్చి తన రాజకీయ చతురత ని మరోసారి నిరూపించుకోబోతున్నారు.ఒప్పందంలో భాగంగా జగన్ పై ఉన్న అవినీతి సీబీఐ కేసులు మాఫీ చేయనున్నారని సమాచారం.బయటకి పోలవరం,రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంటున్నా జగన్ ఢిల్లీ పర్యటన అసలు రహస్యం మాత్రం ఎన్డీయే లో భాగస్వామ్యం అవ్వడమే అంటున్నారు.ప్రత్యేక హోదా గురించి నోరువిప్పకూడదనే ప్రధాన ఒప్పందంతో వైఎసార్సీపి ఎన్డీయే లో చేరేందుకు బీజేపీ అంగీకరించింది. కేసులు మాఫీ అయితే చాలు ప్రత్యేక హోదా ఊసే ఉండదు ఏడాదిలో కేసుల విచారణ,ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు ఎన్డీయే తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం అని జగన్ మోదీ తో భేటీ సందర్భంగా చెప్పనున్నారని సమాచారం. వైఎసార్సీపి ఎన్డీయే లో చేరితే జనసేన పరిస్థితి ఏంటి వైఎసార్సీపీతో కలిసి పనిచెయ్యడానికి పవన్ అంగీకరిస్తారా లేక బీజేపీ కి గుడ్ బై చెబుతారో వేచిచూడాల్సిందే..రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ,జాతీయ అధ్యక్షులు.
0 comments:
Post a Comment