ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో దరియావలి కి ఘన సన్మానం
చిలకలూరిపేట:వైసీపీ కోసం అహోరాత్రులు శ్రమించి పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి షేక్ దరియా వలి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రవేట్ ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఫోరం వ్యవస్థాపకులు షేక్ జాఫర్ అన్నారు.బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం ఆధ్వర్యంలోరాష్ట్ర ముస్లిం- కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన షేక్ దరియా వలి కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు .ప్రముఖ సైకాలజి అధ్యాపకులు షేక్ జిలాని మాట్లాడుతూ షేక్ దరియావలి మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులుషేక్ కరీముల్లా, షేక్ నూరుద్దీన్, షేక్ అబూ బకర్, ఐ.వి.సుబ్బారావు, షేక్ నాసర్ వలి, రాఘవేంద్ర రావు, షేక్ రఫీ, ఆల్బిన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment