బియ్యం ఎగుమతిదారులకు రాయితీల విషయమై, రైల్వే బోర్డు చైర్మన్‌ను కలసిన నర్సారావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు.
వరి పండించే రైతాంగానికి అంతర్జాతీయ మార్కెట్ అవకాశాన్ని అందించడానికి దేశీయ బియ్యం ఎగుమతిదారులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మన రైతాంగం పండిస్తున్న బాస్మతేతర నాణ్యమైన బియ్యం, ఎగుమతుల ద్వారా యేడాదికి 30వేల కోట్ల రుపాయలను ఆర్జిస్తోంది. రైతుల్లో చాలామంది మారుమూల ప్రాంతా్లలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాల్లో వీళ్లు పడించే రైస్‌ను ఎలాంటి ఇబ్బందులులేకుండా రవాణా చేయడానికి, రైల్వేపరంగా సాయం అందించాలని. నర్సారావుపేట ఏంపీ, ర్వైల్వే బోర్డు ఛైర్మన్ కలసి అభ్యర్ధించారు.
బోర్డు ఛైర్మన్ ముందు రెండు ప్రతిపాదనలుంచారు.
1.ఎఫ్‌సిఐ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడే, వేగంగా తరలించడానికి ఎగుమతికి పనికివచ్చే రైస్‌ను వేరుగా గుర్తించడం.
2. రైస్ ఎగుమతిదారులకు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు రైల్వే రవాణా సదుపాయాన్ని విస్తరించడం.
ఈ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఛైర్మన్ స్పందించారు. మారుమూల ప్రాంతల వరి రైతాంగం, తాము పండించిన ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి వీలుగా, పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీనిచ్చారు.
0 comments:
Post a Comment