శ్రామిక వర్గానికి ఏఐటీయూసీ భరోసా...
దేశ ఆర్ధిక వ్యవస్థ అంబాని, ఆదాని చేతిలో బందీగా ఉంది--సిపిఐ ఏరియా కార్యదర్శి cr మోహన్
కార్మిక ఉద్యమాలకు దిక్సూచి ఏఐటీయూసీ
హక్కులను కాలరాస్తున్న పాలకులపై కార్మికవర్గం తిరగబడాలి--కామ్రేడ్ సుభాని
వందేళ్ళ సుధీర్గ పోరాటంలో శ్రామిక, కార్మిక వర్షానికి ఏఐటియుసి భరోసాగా నిలిచిందని, కార్మికుల పక్షాన ఏఐటియుసి చేపట్టిన పోరాట ఉద్యమాలతోనే అనేక హక్కులు సాధించబడ్డాయని సిపిఐ ఏరియా కార్యదర్శి cr మోహన్ అన్నారు. ఏఐటియుసి శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని భవన నిర్మాణకార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. కార్మిక శ్రేయస్సు కోసం, స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటాలు సాగించిన చరిత్ర ఏఐటీయూసీ కి మాత్రమే ఉందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కార్బోరేట్ శక్తులకు దేశ ప్రధాన మోడీ ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైల్వే, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్ బ్యాంకు, రక్షణ రంగాలు పైవేటు పరం అయ్యాయని విమర్శించారు. కామ్రేడ్ సుభాని మాట్లాడుతూమోడీ అసమర్ధ పాలన వల్ల ఆర్ధిక, పారిశ్రామిక వ్యవస్థ అంబానీ, ఆధాని చేతిలో బందీ అయ్యిందన్నారు. పాలకుల తీరుతో పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారారన్నారు. మత ఘర్షణలకు ప్రోత్సహిస్తూ ప్రశ్నించే వారి గొంతు నోక్కుతున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులు ఏఐటియుసి నాయకత్వంలో పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్మికోద్యమాలకు ఏఐటియుసి కారణమని పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఏఐటియుసి స్వాతంత్ర పోరాటంలో నుంచి పుట్టిందన్నారు. నాటి నుండి నేటి వరకు అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కార్మికవర్గం అనుభవిస్తున్న చట్టాలన్ని ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే సంక్రమించాయన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చట్టాలను కార్చోరేట్ యజమానులకు అనుకూలంగా మార్పులు చేస్తూ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా చేసి కార్మిక హక్కులను హరిస్తోందని విమర్శించారు. కార్మిక హక్కులను, చట్టాలను కార్చోరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తున్న ప్రభుత్వాలపై పోరును మరింత ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు, బెట్ సోర్సింగ్ వ్యవస్తే ఉండదని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో కుమ్మక్కై పైవేటీకరణను వేగవంతం చేస్తున్నాడని విమర్శించారు. ప్రైవేటీకరణ విధానాలతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తూ, కరోనా, సమయంలో ప్రజలను ఆదుకోకుండా చేతులెత్తేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వరహాలు,రామారావు,ట్రాలీ ఆటో యూనియన్ నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment