ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న స్మశాన భూమి సర్వే నంబర్ 94 సి లో ఆక్రమణకు గురైన గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి సబ్ కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా వ్యవహరించినప్పటికీ వారు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న తర్వాత మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని హైకోర్టు వారు సకాలంలో స్పందించి చట్టప్రకారం తగు చర్యలు 30 రోజుల్లోగా తీసుకోవాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగిందని ఆయన తెలియజేసినారు గౌరవ హైకోర్టు వారి ఆర్డరు మరియు రిప్రజెంటేషన్ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి అందజేశామని తెలియజేసినారు చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోవాలో అది సకాలంలో కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం చేయవలసిందిగా అధికారులను కోరారు ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు పట్టణ ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి నాదెండ్ల మండల ముఖ్య నాయకుడు నల్లమోతు రంగారావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment