బీసీల కోసం ఎందాకైనా
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని
బీసీల కోసం జగన్.. జగన్ కోసం బీసీలు కార్యక్రమ వేదికను పరిశీలించిన ఎమ్మెల్యే
బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తోందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలో బస్టాండ్ ఎదురుగా మార్కెట్ యార్డు ప్రాంగణంలో శనివారం బీసీల కోసం జగన్.. జగన్ కోసం బీసీలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే విడదల రజిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ సంచలనమే అని తెలిపారు. ప్రవేశపెడుతున్న ప్రతి పథకం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎంతటి ప్రాధాన్యం దక్కుతున్నదో చెప్పేందుకు తానే ఒక ఉదాహరణ అని తెలిపారు. ఇటీవల తమ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ప్రవేశపెట్టి, కమిటీలు కూడా నియమించిందని చెప్పారు. గుంటూరు జిల్లా నుంచి నలుగురికి చైర్మన్ పదవులు దక్కాయని, చిలకలూరిపేట నుంచి ముగ్గురికి ఆయా కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు దక్కాయని వివరించారు. పదవులు దక్కించుకున్న జిల్లాకు చెందిన చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన డైరెక్టర్లందరికీ చిలకలూరిపేటలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహస్తున్నామని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం మంత్రి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుబాబు, బీసీ సంఘ నాయకుడు ఆర్.కృష్ణయ్య, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా బీసీలను సన్మానించేందుకు తరలిరానున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment