గాంధీ విగ్రహం వద్ద రైతుల అరెస్టుకు నిరసన తెలిపిన: చిలకలూరిపేట జేఏసీ నేతలు
అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని, రాజధాని ప్రాంత రైతులు గత 318 రోజుల నుండి నిరవధికంగా నిరసన దీక్షలు చేస్తున్నారు. అయితే రైతుల ఉద్యమాన్ని నీరుగార్చే ఉద్దేశంతో మూడు రాజధానులకు మద్దతు పేరిట పెయిడ్ ఉద్యమాన్ని సృష్టిస్తున్న అరాచక శక్తులను అడ్డుకున్నరన్న నెపంతో ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రైతులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం జరిగింది. రైతులను సంకెళ్లతో బంధించడం, వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం పట్ల అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ కాంగ్రెస్, టి.డి.పి, సి.పి.ఐ, సి.పి.ఎం, బి.ఎస్.పి లోక్ సత్తా,నవతరం, జన క్రాంతి పార్టీల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ కన్వీనర్ ఎం.రాధాకృష్ణ, సి.పి.ఐ సీనియర్ నాయకులు సి.ఆర్. మోహన్, టి.డి.పి నేతలు షేక్ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, S.A.N రాజు, జరీనా సుల్తానా, మురకొండ మల్లి బాబు, జన క్రాంతి పార్టీనేత షేక్ గౌస్ లు ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజధానికి భూములిచ్చిన రైతులను సన్మానించాల్సింది పోయి, సంకెళ్లు వేసి నడివీధుల్లో నడిపిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని తెలిపారు.
తక్షణమే అక్రమ కేసులు ఉపసంహరించుకుని, రైతులను బేషరతుగా విడుదల చేయాలని, రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసివినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమద్ ఖాన్, ఇనగంటి జగదీష్, అంబటి సోంబాబు, షేక్ అబ్దుల్ ఖుమీర్, అందెలశౌరి, చేవూరి కృష్ణమూర్తి, గుర్రంనాగపూర్ణచంద్రరావు, చిన్నం రవి, మద్దుమాలరవి, కేసానుపల్లి రమేష్, కుప్పాల శ్రీనివాసరావు, పిల్లికోటి, బొంతా వేణు, తేలప్రోలు రామ్మూర్తి, అరవపల్లి ఆంజనేయులు, కల్లి వీరరెడ్డి, కుక్కపల్లి శ్రీనివాసరావు, సలిశo శ్రీను, జవ్వాజి బుచ్చిబాబు, షేక్ మీరా వలి, పూర్ణసింగ్, అమరా మణి, తాళ్లూరి భార్గవ్, షేక్ హుస్సేన్, G.C. కరిముల్లా,షేక్ మాలిక్, షేక్అబ్దుల్,షేక్ రఫీ, షేక్ సుభాని(మటన్), రావిపాటి కోటేశ్వరావు, కృష్ణా, దావల రవికుమార్,కాశిమల్ల రాజ, షేక్ ఖాజా మరియు మహిళా నేతలు మిరియాల రత్నకుమారి, పోపూరిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment