ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాల సదస్సు చిలకలూరిపేట
=======================
తేదీ. 31-10-2020.: బ్రిటిష్ తెల్లదొరల పాలన, శ్రమ దోపిడీపై సమరశంఖం పూరిస్తు 1920 అక్టోబరు 31న ప్రప్రథమ జాతీయ కార్మిక సంఘంగా ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు లాలాలజపతిరాయ్ అధ్యక్షులుగా బొంబాయి నగరంలో ఏ ఐ టి యు సి ఆవిర్భవించిందని నాటినుండి నేటి వరకు కు నూరు సంవత్సరాల పోరాటాల ప్రయాణంలో దేశంలోని కార్మికులకు ఉద్యోగులకు కష్టజీవులకు ఎన్నో హక్కులు సాధించి పెట్టిన సంఘం ఏ ఐ టి యు సి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి cr మోహన్ అన్నారు పట్టణంలోని మల్లయ్యలింగం భవన్లో ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాల సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన కార్మిక సంఘం ఏఐటియుసి అని కార్మిక హక్కుల కోసం దేశంలో దీర్ఘకాలిక ఉద్యమాలు జరిగాయని హక్కుల సాధనలో అనేక విజయాలు సాధించి కార్మిక వర్గానికి సైద్ధాంతిక రాజకీయ చైతన్యాన్ని కలిగించింది ఏఐటియుసి అన్నారు కార్మికులకు ఎనిమిది గంటల పని కోసం వేతనాల సవరణ కూలి రేట్ల పెంపుదల కోసం మహిళా కార్మికులకు ప్రత్యేక హక్కులకోసం బోనస్ పి ఎఫ్ ఈఎస్ఐ సెలవులు తదితర హక్కులకోసం ఏఐటియుసి రాజీలేని పోరాటాలు నిర్వహించి సాధించింది అన్నారు దేశంలో 50 కోట్ల మందికి పైబడి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఉత్పత్తి రంగంలో నిరంతరం శ్రమిస్తేనే నిత్యం మానవుడువినియోగించే వస్తూత్పత్తి జరుగుతుందని ఆహారపదార్థాల తయారీ వాటి పంపిణీ రవాణా కార్మికుల వల్లనే సాధ్యమని రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసే కార్మికులకు నేటి పాలకులు కనీస వేతనాలు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నాయని 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని నాలుగు చట్టాలుగా మార్చి కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారని అంబానీ ఆదాని లాంటి కోటీశ్వరులకు అనుకూలంగా చట్టాలను మార్చి లాభాలు చేకూర్చి పెడుతున్నారని అందుకనే ఏ ఐ టి యు సి దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలను ఐక్యం చేసి నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె నిర్వహించబోతున్నారని ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కామ్రేడ్ సుభాని మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ని కార్మికులకు సంఘాలు అవసరమని సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మికులు ఐక్యత తో సంఘటిత శక్తితో ముందుకు సాగాలని యూనియన్ గా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని భవన నిర్మాణ కార్మికులు 30 సంవత్సరాలుగా చేసిన పోరాటాల ఫలితమే సంక్షేమ బోర్డు ఏర్పాటు అయిందని ఏఐ టి యు సి సంఘ సారథ్యంలో కార్మిక సంఘాలు అనేక పోరాటాలతో సమస్యలపై విజయాలు సాధించడం జరిగిందని రానున్న రోజులలో కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు కష్టజీవులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు ఇంకా ఈ సభలో భవన నిర్మాణ కార్మిక సంఘం ముఠా కార్మిక సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ సివిల్ సప్లై హమాలీ కార్మికులు మున్సిపల్ కార్మికులు యూనియన్ ఏ ఐ టి యు సి నాయకులు వరహాలు,రామారావు,తుబటి సుభాని,చెంచెయ్య,కండిమల్ల వెంకటేశ్వర్లు,సౌటుపల్లి నాగేశ్వరావు,నసార్,కొటేశ్వరవు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నూరు సంవత్సరాల కేక్ ను cr మోహన్ కట్ చేశారు.
0 comments:
Post a Comment