గుంటూరు జిల్లాలో ఈ ఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవిరామ కృషి.
-కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ను కలసిన శ్రీకృష్ణ దేవరాయలు..
-చిలకలూరిపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనుమతినివ్వాల్సిందిగా విజ్ఞప్తి
గుంటూరు జిల్లా కు ఎప్పుడో ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణానికి అనుమతి మంజూరైనప్పటికీ, సరైన స్థలం లేకపోవడంతో ఇప్పటిదాకా నిర్మాణానికి నోచుకోలేదు. ఈ విషయమై కేంద్ర కార్మిక శాఖ మంత్రిని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కలిశారు. స్థలం లేకపోవడం వల్లే ఈఎస్‌ఐ హాస్పటల్ నిర్మాణం మొదలుకాలేదని ఆయన దృష్టి కి తీసుకొచ్చారు. సరైన ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈఎస్ఐ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు ఈ పరిస్థితి మారనుంది. హాస్పటల్ నిర్మాణానికి అవసరమైన భూమిని చిలకలూరిపేటలో ఇప్పటికే గుర్తించారు. ఎన్ హెచ్ 5కు సమీపంలో తిమ్మాపురం, గనపవరంలో భూమి ఉందని కేంద్రమంత్రికి తెలిపారు. పరిశీలించి
హాస్పటల్ నిర్మాణాన్ని తక్షణం మొదలుపెట్టాల్సిందిగా అభ్యర్ధించారు. స్థల లభ్యత గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి, గుంటూరు జిల్లా ప్రయోజనం కోసం చిలకలూరిపేటలో త్వరితంగా ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణానికి తన
వంతు సాయం చేస్తానని హామినిచ్చారు
0 comments:
Post a Comment