చిలకలూరిపేట
రాజధాని రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి ,సంకెళ్లు వేయడాన్ని సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ తీవ్రంగా ఖండించారు. సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, మూడు రాజధానులు చేసి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం అవివికం అని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజధాని మీద తన వైఖరిని మార్చుకోవాలని కోరారు.కామ్రేడ్ సుభాని మాట్లాడుతూ అమరావతి శంకుస్థాపన చేసిన దేశ ప్రధాని నరేంద్రమోడీ రాజధాని మీద ద్వందవైఖరిని వీడి స్పష్టత ఇచ్చే వరకు రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగభైరు సుబ్బాయమ్మ,వరహాలు,రామారావు,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment