జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జోతిరావ్ పూలే 130 వ వర్థంతి ఘన నివాళి
చిలకలూరిపేట పట్టణంలోని ముదిరాజ్ కళ్యాణమండపం నందు మహాత్మ జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతిని జాతీయ బీసీ సంక్షేమ సంఘంచిలకలూరిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాదాసు పృథ్వీరాజ్ ( సాయి ) మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు 18వ శతాబ్దం లో జన్మించారు బడుగు బలహీన వర్గాలకు చదువు ఉంటేనే ఆర్థికంగా , సంఘ పరంగా , విద్యా పరంగా , రాజకీయ పరంగా , అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అని వీరి భార్య సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ఎందరో మహిళలకు విద్య అవకాశం కలుగజేశారు రాజకీయపరంగా సంఘ పరంగా , ఎన్ని అవంతరాలు ఎదురైనా అప్పటికీ వాటిని ఎదుర్కొని అందరికి విద్య కావాలని వందకి పైగా కాలేజీలు స్థాపించిన అటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు . గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి ఒక వ్యక్తి అని వారి భార్య సావిత్రిబాయి పూలే గారితో మహిళలకు మొట్టమొదటిసారిగా విద్య నేర్పించిన టువంటి ఆదర్శ వంతురాలు అని మహిళా అభ్యుదయానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని భారతదేశంలోనే ప్రతి మహిళ ఎంతో రుణపడి ఉండాలని , ప్రతి మహిళ వారి ఆశయాలను గుర్తుపెట్టుకోవాలని మహిళలకు విద్య ఉంటేనే ఆ కుటుంబం , ఊరు , ఆదేశం , ఎంతో అభివృద్ధి చెందుతాయని గుర్తించినటు వంటి మహోన్నతమైన వ్యక్తులు జ్యోతిరావు పూలే , సావిత్రి బాయి పూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి భాస్కరరావు , ఎడ్లపాడు మండలం అధ్యక్షులు రావులపల్లి రామకృష్ణ , బీసీ సంఘం నాయకులు వేముల శ్రీనివాస రావు , నరసరావుపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు తన్నీరు రామారావు ,రాష్ట యువజన కార్యదర్శి ఆలా శివ గోపి , గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు , గుంటూరు జిల్లా కార్యదర్శి పల్లపు శివ పోలయ్య , గుంటూరు జిల్లా మహిళా విభాగం కార్యదర్శి పిట్టల రమణ , చిలకలూరిపేట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ తులసి , మిత్ర సర్వీస్ సొసైటీ అధ్యక్షులు , కొండ్రముట్ల నాగేశ్వరరావు , గుంజి బాలసుబ్రమణ్యం , దేవరకొండ నాగేశ్వరరావు , అనపర్తి వెంకట్, రాచపూడి వెంకట్ , మురుగుల గోపి , నాని, కొరివి రంగయ్య , తేజ, చోప్ప వీరనారాయణ పాల్గొన్నారు
0 comments:
Post a Comment